వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కి 3.39 లక్షల కాల్స్

ABN , First Publish Date - 2021-10-03T21:27:22+05:30 IST

సాయం కోసం ఎదురుచూసే వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ‘ఎల్డర్‌లైన్’కు మే నుంచి ఇప్పటి

వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కి 3.39 లక్షల కాల్స్

న్యూఢిల్లీ: సాయం కోసం ఎదురుచూసే వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ‘ఎల్డర్‌లైన్’కు మే నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏకంగా 3.39 కాల్స్ వచ్చాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచే రావడం గమనార్హం. వృద్ధుల సహాయార్థం టాటా ట్రస్ట్‌తో కలిసి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఈ జాతీయ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. 


ఈ హెల్ప్‌లైన్‌కు ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 79,542 కాల్స్ రాగా, ఉత్తరాఖండ్ నుంచి 54,432, తెలంగాణ నుంచి 42,610, తమిళనాడు నుంచి 27,708, కర్ణాటక నుంచిt 22,711 ఫోన్ కాల్స్ వచ్చాయి. మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఈ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సాయం కోరడం గమనార్హం. మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం ‘ఎల్డర్‌లైన్’కు 23,390 మంది పురుషులు కాల్ చేస్తే , మహిళలు మాత్రం 8,178 మంది మాత్రమే సాయాన్ని అర్థించారు.


కొవిడ్ సపోర్ట్ కోసం 13,496, పెన్షన్ కోసం 8,952, వేధింపులకు సంబంధించి 1890, ఆరోగ్య సంబంధ సమస్యలపై 1202, సాయం కోసం 423, వృద్ధాశ్రమాల సమాచారం కోసం 632 కాల్స్ వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మే 1 నుంచి ఇప్పటి వరకు 3,39,879 కాల్స్ రాగా, వీటిలో 3,02,195కు సేవలకు సంబంధం లేనివి ఉన్నట్టు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ తెలిపింది.  

Updated Date - 2021-10-03T21:27:22+05:30 IST