గర్భిణుల సేవలకు హెల్ప్‌లైన్‌

ABN , First Publish Date - 2021-05-19T04:59:36+05:30 IST

గర్భిణులకు సేవలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు

గర్భిణుల సేవలకు హెల్ప్‌లైన్‌

మేడ్చల్‌ అర్బన్‌ : గర్భిణులకు సేవలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ మల్లికార్జునరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాన్పుల కోసం, కొవిడ్‌-19 బారినపడిన గర్భిణీల అత్యవసర సేవల కోసం 7382471061, 7382482399 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలి. అంబులెన్స్‌తోపాటు అవసరమైన అన్నిరకాల సేవలు అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-05-19T04:59:36+05:30 IST