బాలబాలికల రక్షణకు హెల్ప్‌లైన్‌

ABN , First Publish Date - 2021-05-14T05:35:40+05:30 IST

బాలబాలికల రక్షణకు హెల్ప్‌లైన్‌

బాలబాలికల రక్షణకు హెల్ప్‌లైన్‌
వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

  • పోస్టర్‌ ఆవిష్కరించిన రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌)  : కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బాలబాలికలను కాపాడేందుకు హెల్ప్‌లైన్‌ 040-23733665 నంబర్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మహిళా, శిశు సంక్షేమశాఖ తరఫున హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు కాల్‌ చేసి సమాచారం అందిస్తే.. తాత్కాలిక వసతి గృహాల్లోకి పిల్లలను తరలించి పౌష్టికాహారం, వైద్య సదుపాయాలను కల్పిస్తారని తెలిపారు. అత్యవసర సమయాల్లో 1098 నెంబరుకు ఏ సమయంలోనైనా కాల్‌ చేసి సమచారం అందించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొవిడ్‌తో బాధపడుతున్న చిన్నారుల విషయంలో హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తే పిల్లలకు వసతి, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశుసంక్షేమ శాఖ అధికారి మోతి, బాల్యరక్ష భవన్‌ కో-ఆర్డినేటర్‌ హర్షవర్ధిని, పిల్లల సంరక్షణ విభాగం అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T05:35:40+05:30 IST