మహిళా సాధికారతకు ‘హర్‌ సర్కిల్‌’

ABN , First Publish Date - 2021-03-08T06:38:40+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ భార్య నీతా అం బానీ ‘హర్‌ సర్కిల్‌’ పేరి ట ఒక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఏర్పాటు చేశారు. మహిళలకు అవసరమైన అంశాలన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి...

మహిళా సాధికారతకు ‘హర్‌ సర్కిల్‌’

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ భార్య నీతా అం బానీ ‘హర్‌ సర్కిల్‌’ పేరి ట ఒక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఏర్పాటు చేశారు. మహిళలకు అవసరమైన అంశాలన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇందులో రిజిస్టర్‌ చేసుకోవడం ఉచితమే. ప్రస్తుతానికి ఇంగ్లీ్‌షలో ప్రారంభించిన దీన్ని తదుపరి దశలో ఇతర భాషలకు విస్తరిస్తామని ప్రకటించారు. ఈ సర్కిల్‌ యూజ ర్లు జీవితంలోని పలు అంశాలకు చెందిన వీడియోలు చూడవచ్చు, వ్యాసాలు చదువుకోవచ్చునని ఆమె చెప్పారు. అలాగే ఆరోగ్యం, వెల్‌నెస్‌, విద్య, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ సహా భిన్న అంశాలపై రిలయన్స్‌ నిపుణుల ప్యానెల్‌ నుంచి జవాబులు కూడా పొందవచ్చునని ఆమె తెలిపారు. ప్రతీ ఒక్క మహిళ దీన్ని తమదిగా భావించి ఇందులో భాగస్వామి కావాలని ఆమె పిలుపు ఇచ్చారు. 

Updated Date - 2021-03-08T06:38:40+05:30 IST