ఆమె పారితోషికం... రూ. 3 కోట్ల పైమాటే...

ABN , First Publish Date - 2021-06-18T02:04:04+05:30 IST

ఆ అందగత్తె పారితోషికం ఎంతో వింటే ఆశ్చర్యం కలగక మానదు. సూపర్ స్టార్లు కూడా అంత డిమాండ్ చేయరేమోననిపిస్తుంది.

ఆమె పారితోషికం... రూ. 3 కోట్ల  పైమాటే...

ముంబై : ఆ అందగత్తె పారితోషికం ఎంతో వింటే ఆశ్చర్యం కలగక మానదు. సూపర్ స్టార్లు కూడా అంత డిమాండ్ చేయరేమోననిపిస్తుంది. అదీ చిన్న వయస్సులో. మరి ఆమెకు అంత క్రేజ్ ఎందుకు ? నిజంగా అంతగా రాణిస్తోందా ? ఆమెను అథిగా ఆరాధించే అభిమానులున్నారా ? వాస్తవానికి అంత ఖచ్చితంగా సమాధానాలు దొరకని ఈ ప్రశ్నలకు... ఆమె సమాధానం ఒకటే... ‘నా దగ్గర టాలెంట్ ఉంది. అందముంది’ అని. ఈ భామ గురించిన వివరాలు తెలుసుకోవాలంటే... ఈ కథనం చదవండి... 


బాలీవుడ్ లో ప్రస్తుతం కియారా అద్వానీ టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తోంది. ఇక ఇదే క్రమంలో... దక్షిణాది సినిమాల కోసం కియారా డిమాండ్ చేస్తోన్న పారితోషికం అటు చిత్రపరిశ్రమ వర్గాలకు, ఇటు సాధారణ ప్రేక్షకులకు, సంబంధిత నానికి పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కొరటాల-యంగ్  దర్శకత్వంలో జూనియర్ ఎన్‌టీఆర్ కు జతగా ఓ సినిమాలో నటించనున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈమె నటించబోయే సినిమా ఎంతమేరకు వ్యాపారం చేస్తుందన్న విషయమై పందేలు సైతం జోరుగా సాగుతున్నాయి. ఇక విషయానికొస్తే... 


దక్షిణాది సినిమాకు కియారా రూ. 3 కోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. తాజాగా అదే రెమ్యునరేషన్ తో ఈ ప్రాజెక్ట్ కు కియారా సంతకం చేసినట్లు సమాచారం. అయితే మొదటినుంచీ కూడా... కియారాను ఎంపిక చేయడమా ? మానుకోవడమా ? అన్న సందిగ్ధంలో ఉన్న దర్శకనిర్మాతలు తాజాగా ఆమెను సంప్రదించి ఓకే చేసినట్లు వినవస్తోంది. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ వంటి సినిమాలతో సుపరిచితురాలైన కియారాకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ తో పాటు, ఫాలోయింగ్ కూడా ఏర్పడినట్లు సంబంధిత వర్గాల టాక్.  ఓకే అయితే చెప్పారు కానీ... ఈ అమ్మడికున్న క్రేజ్... తమ సినిమాకు ఆ స్థాయిలో డబ్బు కురిపిస్తుందా ? అన్న సందిగ్ధం ఇప్పుడు దర్శక, నిర్మాతలను పీడిస్తున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2021-06-18T02:04:04+05:30 IST