Abn logo
Sep 16 2021 @ 17:43PM

Canada Polls 2021: ఎన్నారైలదే హవా.. ఈసారి ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారంటే..

ఒట్టావా: కెనడాలో ఎన్నారైలు సత్తాచాటుతున్నారు. అక్కడి రాజకీయాలలో మనోళ్లు చక్రం తిప్పుతున్నారు. ఇంకా చెప్పాలంటే కింగ్‌మేకర్ స్థాయికి ఎదిగారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం 338 మంది సభ్యులు ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో 22 మంది భారత సంతతి వారు ఉన్నారు. వీరిలో ముగ్గురు కేబినెట్ మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా సిక్కు కమ్యూనిటీ నుంచి అధికంగా కెనడా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత హౌస్‌లో ఏకంగా 18 మంది ఎంపీలు సిక్కు సమాజానికి చెందినవారే. ఇలా కెనడా రాజకీయాల్లో మనోళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. 


కెనడా జనాభాలో కేవలం 4 శాతం మాత్రమే ఉన్నా ప్రవాస భారతీయులు.. ఆ దేశ దేశ ఆర్థిక, రాజకీయ, అభివృద్ధి రంగాల్లో కీలకంగా ఉండడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో కూడా ప్రధానమైన ఐదు పార్టీల నుంచి ఏకంగా 47 మంది ఎన్నారైలు బరిలో ఉన్నారు. ఈ నెల 20న జరగనున్న కెనడా ఎన్నికల్లో వీరు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో మొత్తం 47 మంది భారత సంతతి అభ్యర్థులు బరిలో ఉండగా.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ నుంచి అత్యధికంగా 17 మంది పోటీ చేస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి 13 మంది, న్యూ డెమొక్రటిక్ పార్టీ నుంచి 10 మంది బరిలో ఉన్నారు. అలాగే పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నుంచి ఐదుగురు, గ్రీన్ పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. 


ఇవి కూడా చదవండి..

రికార్డు స్థాయిలో Kuwait కు గుడ్ బై చెప్పిన వలసదారులు.. ఏడాదిన్నరలో..

Kuwaitలో ఇక జైల్ ఫ్రమ్ హోమ్.. అమల్లోకి సరికొత్త నిబంధన.. వాళ్లందరికీ బెన్‌ఫిట్.. కండిషన్స్ ఏంటంటే..ఇదిలాఉంటే.. అందరి దృష్టి ఇప్పుడు న్యూ డెమొక్రటిక్ పార్టీ అధినేతగా ఉన్న జగ్మీత్ సింగ్‌పై ఉంది. 2017 ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే  ఎన్‌డీపీ ఏకంగా 24 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రీపిట్ అయితే ఆయన కింగ్‌మేకర్‌గా మారుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. 


పార్టీలవారీగా మనోళ్లు పోటీ చేస్తున్న ప్రాంతాలు, అభ్యర్థుల జాబితా ఇదే..

లిబరల్ పార్టీ: రుబీ సహోతా(బ్రాంప్టన్ నార్త్), సోనియా సిద్ధు(బ్రాంప్టన్ సౌత్), కమల్ ఖేరా(బ్రాంప్టన్ వెస్ట్), అంజు ధిల్లాన్(డొర్వల్-లాచైన్-లాసల్లే), రణదీప్ ఎస్ సరాయి(సర్రే సెంటర్), మణిందర్ సిద్ధు(బ్రాంప్టన్ ఈస్ట్), సుఖ్ ధలీవాల్(సర్రే న్యూటన్), లఖ్వీందర్ ఝాజ్, పరం బైన్స్, సబ్రినా గ్రోవర్.  


కన్జర్వేటివ్ పార్టీ: సుఖ్‌బిర్ సింగ్ గిల్(వాంకోవర్ సౌత్), నవాల్ బజాజ్(బ్రాంప్టన్ ఈస్ట్), మెధా జోషి(బ్రాంప్టన్).  


న్యూ డెమొక్రటిక్ పార్టీ: తేజిందర్ సింగ్(బ్రాంప్టన్ సౌత్), గుర్‌ప్రీత్ గిల్(బ్రాంప్టన్ వెస్ట్), అవ్నీత్ జోహల్(సర్రే న్యూటన్), గురీందర్ సింగ్ గిల్(కాల్గరీ స్కైవ్యూ).


ఇతర పార్టీలు, స్వతంత్రులు: ఇటీవల కొత్తగా ఏర్పడిన పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా ఏకంగా ఐదుగురు భారత సంతతి అభ్యర్థులను బరిలోకి దించుతోంది. అలాగే గ్రీన్ పార్టీ తరఫున దేవయాని సింగ్(వాంకోవర్), సర్రే న్యూటన్ నుంచి ప్రవీణ్ హుందల్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. 


ఇక కెనడాలోని టొరంటో, వాంకోవర్, ఒట్టావా, హామిల్టన్, మాంట్రియల్ ప్రాంతాల్లో ఇండో-కెనడియన్‌ జనాభా అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఈ ప్రాంతాల నుంచి గెలిచిన అభ్యర్థులు కీలకంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఇక్కడి నుంచి భారీ మొత్తంలో భారత సంతతి అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. దీంతో ఈసారి కెనడా ఎన్నికల్లో చాలా ఎలక్టోరల్ సీట్లు.. ఇండియన్ వర్సెస్ ఇండియన్ లేదా పంజాబీ వర్సెస్ పంజాబీ పోరును కలిగి ఉన్నాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...