Abn logo
Oct 26 2021 @ 15:40PM

Aryan Khan బెయిల్‌పై విచారణ జరుగుతోంటే.. Sameer Wankhede ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటే..

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వస్తుందా..? రాదా..? ఇప్పటికే రెండు సార్లు బెయిల్ తిరస్కరణకు గురి అయిన నేపథ్యంలో హైకోర్టులో అయినా ఆర్యన్‌కు ఊరట లభిస్తుందా..? లేదా..? అన్నది బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 3వ తారీఖున ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈనాటి వరకు ఆర్యన్ ఖాన్ జైల్లోనే గడుపుతున్నారు. ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన సమీర్ వాంఖడేపై ఓ సెక్షన్ వర్గం ప్రశంసలు కురిపిస్తోంటే.. మరో వర్గం మాత్రం టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్యన్ విడుదల కోసం రూ.25 కోట్ల వరకు షారూఖ్ నుంచి లంచం డిమాండ్ చేశారన్న వార్తలు ఒక్కసారిగా అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. 

వాస్తవానికి మంగళవారం హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి. ఆర్యన్ ఖాన్ బెయిల్‌ను బలంగా వ్యతిరేకిస్తున్న ఎన్సీబీ అధికారులు.. విచారణకు అతడు ఎంత కీలకమన్న వివరాలను కోర్టుకు ఇప్పటికే సమర్పించారు కూడా. మేజిస్ట్రేట్ కోర్టులోనూ, ప్రత్యేక కోర్టులోనూ బెయిల్ తిరస్కరణకు గురయినప్పుడు ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే స్వయంగా కోర్టులోనే ఉన్నారు. కానీ, అత్యంత కీలకమైన హైకోర్టు విచారణ సందర్భంగా మాత్రం ఆయన ముంబైలో లేకుండా పోయారు. సోమవారం రాత్రే సమీర్ వాంఖడే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం ఎన్సీబీ చీఫ్‌ను కలిసి తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవడానికి వెళ్లారు. ఈ కేసు విషయం గురించే కాకుండా, లంచం డిమాండ్ ఆరోపణల గురించి కూడా సమీర్ వాంఖడే‌ను ప్రశ్నించనున్నారని సమాచారం. అయితే తనకు ఎన్‌సీబీ చీఫ్‌ నుంచి సమన్లు అందలేదని, వేరేపనిపై వచ్చానని సమీర్ వాంఖడే విలేకరులకు చెప్పడం గమనార్హం.

ఇవి కూడా చదవండిImage Caption