ఇక్కడ... కిలో అర‌టిపండ్లు ... రూ. 3,400/-...

ABN , First Publish Date - 2021-06-18T01:37:28+05:30 IST

ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.

ఇక్కడ... కిలో  అర‌టిపండ్లు ... రూ. 3,400/-...

ప్యాంగ్‌యాంగ్ : ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం... కిలో అరటి పండ్లు కొనాలంటే... భారత కరెన్సీలో రూ. 3,400 వెచ్చించాల్సిందే. ఆ దేశాధ్య‌క్షుడు కిమ్ స్వ‌యంగా విషయమిది.  టైఫూన్ వ‌ర‌ద‌లు రావ‌డంతో ఈ ఏడాది... వ్య‌వసాయ రంగం ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోయింద‌ని కిమ్ పేర్కొన్నారు.  కరోనా విజృంభ‌ణ నేపధ్యంలో... కొరియా తన స‌రిహ‌ద్దుల‌ను మూసేసిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


క‌రోనా నేపధ్యంలో ఉత్తర కొరియాలో తీవ్ర‌మైన ఆంక్ష‌ల‌ు అమల్లో ఉండడంతో... ఆహార నిల్వ‌లు అడుగంటిపోయాయి.  ఈ క్రమంలో... కిలో అర‌టిపండ్లు కొనాలంటే... 46 డాలర్ల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆహారం‌, ఇంధనం, ఎరువులు తదితరాల కోసం పొరుగు దేశమైన చైనామీద‌ే ఆధారపడాల్సిన పరిస్థితి. కాగా... చైనాతో స‌రిహ‌ద్దులు మూసేయ‌డంతో ఆ దేశం నుంచి దిగుమ‌తులు గణనీయంగా తగ్గిపోయాయి.


ఇరవై ఏళ్ళ క్రితం(1990) ఉత్తర కొరియాలో తీవ్రస్థాయిలో కరవు ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  ఆ స‌మ‌యంలో... క్షుద్భాధతో అలమటించాల్సిన పరిస్థితుల్లో... దాదాపు 30 ల‌క్ష‌ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-06-18T01:37:28+05:30 IST