ఇక్కడా... ఎన్నికల వ్యూహకర్త ఆయనే..

ABN , First Publish Date - 2020-09-27T21:19:30+05:30 IST

ప్రశాంత్ కిషోర్(పీకే)... గుర్తున్నాడా ? గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే వేళ ఆయా పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఇప్పుడు ఇదే క్రమంలో... పంజాబ్ లో కూడా... ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఆయనే వ్యూహకర్తగా వ్యవహరించనున్నాడు. మరో పదిహేను నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

ఇక్కడా... ఎన్నికల వ్యూహకర్త ఆయనే..

చండీఘర్ : ప్రశాంత్ కిషోర్(పీకే)... గుర్తున్నాడా ? గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే వేళ ఆయా పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఇప్పుడు ఇదే క్రమంలో... పంజాబ్ లో కూడా... ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఆయనే వ్యూహకర్తగా వ్యవహరించనున్నాడు. మరో  పదిహేను నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


ఈ నేపధ్యంలో... పీకేతో చర్చించిన అమరీందర్ సింగ్... ఆయనతో ఒప్పందం కుదుర్చోవాలని నిర్ణయించారు. దీంతో ఆ ఎన్నికలపై పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ అప్పుడే దృష్టి పెట్టినట్లైంది. ప్రశాంత్‌ కిశోర్‌ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని ఆ పార్టీ పంజాబ్‌ నాయకత్వం ప్రయత్నాలు జరుపుతోంది. కాగా... మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, పథకాలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి అమరీందర్ ఇప్పటికే ప్రణాళికలు రచించారు.


కాగా... ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలను గెలిపించడానికి పనిచేస్తోన్న విషయం తెలిసిందే. ఒప్పందం కుదరగానే ఆయన బృందం రంగంలోకి దిగి అన్ని వ్యవహారాలను చూసుకుంటుంది.

Updated Date - 2020-09-27T21:19:30+05:30 IST