రైఫిల్‌ షూటింగ్‌లో హీరో అజిత్‌కు 4 స్వర్ణాలు

ABN , First Publish Date - 2021-03-08T09:19:59+05:30 IST

మిళ హీరో అజిత్‌ తమిళనాడు రాష్ట్ర స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఏకంగా ఆరు పతకాలు

రైఫిల్‌ షూటింగ్‌లో  హీరో అజిత్‌కు 4 స్వర్ణాలు

చెన్నై (ఆంధ్రజ్యోతి): తమిళ హీరో అజిత్‌ తమిళనాడు రాష్ట్ర స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఏకంగా ఆరు పతకాలు (4 స్వర్ణ, 2 రజత) గెల్చుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో స్వర్ణం నెగ్గిన అజిత్‌, సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌, స్టాండర్డ్‌ విభాగాల్లో ఒక్కో పసిడి, రజత పతకాలు నెగ్గాడు. అలాగే ఫ్రీ పిస్టల్‌ 50 మీటర్ల టీమ్‌ విభాగంలోనూ పసిడి కైవసం చేసుకున్నాడు. అజిత్‌ చెన్నై రైఫిల్‌ క్లబ్‌ తరపున పోటీల్లో పాల్గొన్నాడు.

Updated Date - 2021-03-08T09:19:59+05:30 IST