మహీంద్రా కంపెనీ ఉత్పత్తి కేంద్రంలో హీరో ఎలక్ట్రిక్ బైకులు...

ABN , First Publish Date - 2022-01-20T22:49:15+05:30 IST

విద్యుత్తు వాహనాల రంగంలో ఆయా కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. క్రమంగా ఊపందుకుంటోన్న మార్కెట్‌లో ‘పట్టు’ కోసం ప్రముఖ ఆటో దిగ్గజాలు వేగం పెంచుతున్నాయి.

మహీంద్రా కంపెనీ ఉత్పత్తి కేంద్రంలో హీరో ఎలక్ట్రిక్ బైకులు...

విద్యుత్తు వాహనాల మార్కెట్...  కుదిరిన ఒప్పందం

ఏటా పది లక్షల యూనిట్లు... 

ముంబై : విద్యుత్తు వాహనాల రంగంలో ఆయా కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. క్రమంగా ఊపందుకుంటోన్న మార్కెట్‌లో ‘పట్టు’ కోసం ప్రముఖ ఆటో దిగ్గజాలు వేగం పెంచుతున్నాయి. భారీ పెట్టుబడులు, ఒప్పందాలతో వస్తున్నాయి. ఈ క్రమంలోనే... దేశీయంగా రెండు ప్రముఖ కంపెనీల మధ్య కుదిరిన ఓ ఒప్పందం సంచలనంగా మారింది. హీరో ఎలక్ట్రిక్ కంపెనీతో మహీంద్రా సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇరు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకాలు చేసినట్టు అధికారికంగా ప్రకటించాయి. 


ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రా కంపెనీకి చెందిన ఉత్పత్తి కేంద్రంలో హీరో విద్యుత్తు బైకులు తయారు కానున్నాయి. మధ్యప్రదేశ్ లోని మహీంద్రా పీథంపూర్ ప్లాంట్ లో ఈ బైకులు ఉత్పత్తి కానున్నాయి. ఆప్టిమా, ఎన్‌వైఎక్స్ ద్విచక్ర వాహనాలు  తయారు కానున్నాయి. ఈ(2022) ఏడాది చివరి నాటికి... ఏటా 10 లక్షల విద్యుత్తు స్కూటర్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు హీరో ఎలక్ట్రిక్ ప్రకటించింది. అటు తమ సొంత ఉత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తిని పెంచుతున్నట్టు వెల్లడించింది.   

Updated Date - 2022-01-20T22:49:15+05:30 IST