Abn logo
Aug 15 2020 @ 00:07AM

కొత్త పాయింట్‌తో...

నూతన నటుడు కార్తీక్‌సాయి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సైకో’. ఆవుల రాజు యాదవ్‌, వాసు సంకినేని నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ‘కొత్త పాయింట్‌తో, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో చిత్రం నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు కథ, కథనమే బలం’ అని నిర్మాతలు తెలిపారు. సమాజానికి పనికి వచ్చే సందేశంతో రూపుదిద్దుకొంటున్న చిత్రం ఇదని  దర్శకుడు, హీరో కార్తీక్‌సాయి చెప్పారు. డాలీ షా, నేహా దేశ్‌పాండే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: తోట సతీశ్‌.

Advertisement
Advertisement
Advertisement