Abn logo
May 27 2020 @ 19:36PM

లాక్‌డౌన్‌లో హీరో కార్తికేయ సిక్స్ ప్యాక్

యంగ్ హీరోలలో ఈ మధ్య వచ్చిన కార్తికేయ రూటే వేరు. ఆయన చేసే పని చాలా కామ్‌గా ఉంటుంది. కానీ దాని అవుట్ పుట్ మాత్రం చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఇటీవల ఓ స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన కార్తికేయ ముందు చాలా సింపుల్‌గానే స్టార్ట్ చేశాడు. డ్యాన్స్ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా స్టేజ్‌ని వణికించాడు. ఆయన మాటలతో మెగాభిమానుల ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి మరి. ఇక విషయంలోకి వస్తే తాజాగా కార్తికేయ తన ట్విట్టర్‌లో ఓ పిక్‌ను పోస్ట్ చేశాడు. ఇది అలాంటిలాంటి పిక్ కాదు. సిక్స్ ప్యాక్‌లో కండలు తిరిగిన శరీరంతో కార్తికేయ లుక్ అదిరిపోయేలా ఉంది.


‘‘లాక్‌డౌన్ మనం చేసుకున్న ప్లాన్‌లను మార్చేసింది. కానీ మనం సాధించాలనుకున్న వాటిపై మాత్రం దాని ప్రభావం చూపించలేకపోయింది..’’ అంటూ కార్తికేయ తన ట్వీట్‌లో తెలిపాడు. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో.. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నటిస్తున్నాడు.  మాస్ ఎంటర్‌టైనర్‌లో తెరకెక్కనున్న ఈ మూవీలో కార్తికేయ బస్తీ బాలరాజుగా కనిపించనున్నారు. 


Advertisement
Advertisement
Advertisement