‘హీరో’ లాభం రూ.964 కోట్లు

ABN , First Publish Date - 2020-10-29T06:04:20+05:30 IST

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హీరో మోటోకార్ప్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.963.82 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో

‘హీరో’ లాభం రూ.964 కోట్లు

న్యూఢిల్లీ: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో హీరో మోటోకార్ప్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.963.82 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.883.78 కోట్ల లాభంతో పోలిస్తే 9.05 శాతం పెరిగింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.9,473 కోట్లకు చేరుకుంది. జూలై-సెప్టెంబరు మధ్యకాలంలో మొత్తం 18.22 లక్షల వాహనాలు విక్రయించినట్లు హీరోమోటోకార్ప్‌ వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 7.7 శాతం వృద్ధి చెందాయని కంపెనీ పేర్కొంది. 

Updated Date - 2020-10-29T06:04:20+05:30 IST