Abn logo
Jan 17 2021 @ 15:59PM

నాకు కాంపిటిష‌న్ ఎవ‌రో అర్థ‌మైంది: హీరో రామ్‌

‘‘దేవ‌దాసు’ సినిమాతో 15 ఏళ్ల క్రితం సంక్రాంతి సీజ‌న్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాను. మ‌ళ్లీ ఇప్పుడు ‘రెడ్’ రిలీజ‌యింది. నాకు సిస‌లైన కాంపిటిష‌న్ ఎవ‌ర‌న్న‌ది 15 ఏళ్ల త‌ర్వాత అర్థ‌మైంది’’ అని అన్నారు రామ్‌.  శ‌నివారం ‘రెడ్ ‘ సినిమా సక్సెస్ సెల‌బ్రేష‌న్స్ విశాఖ‌ప‌ట్ట‌ణంలోని గుర‌జాడ క‌ళాక్షేత్రంలో శ‌నివారం రాత్రి జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విజ‌యం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ ‘‘మేం చాలా ట్విస్టులతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీశాం. కానీ సినిమాలో ఉన్న ట్విస్టులకన్నా సినిమా విడుదల తరువాత ఒక పెద్ద ట్విస్ట్ ని ఎక్స్ పీరియ‌న్స్ చేశాం. నిజానికి సినిమా రిలీజ్ టైమ్‌లో ఈ సినిమాను ఆడియ‌న్స్ ఎలా రిజీవ్ చేసుకుంటారు?  వారి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అని ఈగ‌ర్‌గా వెయిట్ చేశాం. మార్నింగ్ షో కి వచ్చిన అభిప్రాయాలన్నీ సాయంత్రానికి మారిపోయాయి. ప్ర‌తి షో పూర్త‌యిన త‌ర్వాత మ‌రుస‌టి షోకి క‌లెక్ష‌న్లు అంత‌కంత‌కూ పెర‌గ‌సాగాయి. మా సస్పెన్స్ థ్రిల్లర్ ని థ్రిల్లింగ్ హిట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.  15 సంవత్సరాల తరువాత నా కాంపిటీషన్ ఎవరనే విష‌యం అర్థం అయింది. అభిమానులుగా మీరు చూపించే ప్రేమ ఎక్కువా, నేను మీకు చూపించే ప్రేమ ఎక్కువా అన్నదాంట్లోనే మనకి పోటీ న‌డుస్తోంది’’ అన్నారు.

Advertisement