May 18 2021 @ 23:34PM

తాతయ్యది రాజులాంటి మనసు - హీరో రామ్‌

రవికిశోర్‌ సోదరుడు మురళీ కుమారుడు, యువ హీరో రామ్‌ తాతయ్య మరణంతో భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘తాతయ్య... మీది రాజులాంటి మనసు. విజయవాడలో లారీ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించి, కుటుంబసభ్యులకు వసతులు-సౌకర్యాలు కల్పించడం కోసం లారీ పక్కన నిద్రించిన రోజులెన్నో ఉన్నాయి. జేబులో డబ్బున్నవాళ్ల కంటే, మంచి మనసున్న వాళ్లు శ్రీమంతులని మీరు నేర్పించారు. ఇవాళ మీ పిల్లలంతా ఉన్నతస్థాయిలో ఉన్నారంటే మీరే కారణం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ అని రామ్‌ ట్వీట్‌ చేశారు.