రాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా మహిళ.. పోలీసులను చూసి పరుగోపరుగు.. చెక్ చేస్తే ఆమె వద్ద..

ABN , First Publish Date - 2022-01-02T21:42:13+05:30 IST

న్యూయర్ వేడుకలను ఘనంగా చేసుకుని ప్రజలందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. కానీ ఓ మహిళ మాత్రం అర్ధరాత్రి అయినా రోడ్డుపైనే నిల్చొని ఉంది. పోలీసులు పెట్రోలింగ్ చేయడం కూడా ప్రారం

రాత్రి వేళ రోడ్డుపై ఒంటరిగా మహిళ.. పోలీసులను చూసి పరుగోపరుగు.. చెక్ చేస్తే ఆమె వద్ద..

ఇంటర్నెట్ డెస్క్: న్యూయర్ వేడుకలను ఘనంగా చేసుకుని ప్రజలందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. కానీ ఓ మహిళ మాత్రం అర్ధరాత్రి అయినా రోడ్డుపైనే నిల్చొని ఉంది. పోలీసులు పెట్రోలింగ్ చేయడం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసుల కారు సైరన్ విని.. సదరు మహిళ పరుగు ప్రారంభించింది. దీంతో అధికారులు ఆమెను వెంబడించారు. తీరా ఆమె బ్యాగ్‌లో ఉన్నదాన్ని చూసి అధికారులు షాకయ్యారు. ఇంతకూ విషయం ఏంటంటే..



ఎప్పటిలాగే హర్యానాలోని రోహ్తక్ సిటీ పోలీసులు.. శనివారం రాత్రి కూడా పెట్రోలింగ్ చేయడాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన ఓ మహిళ పారిపోవడాన్ని అధికారులు గమనించారు. దీంతో ఓ కానిస్టేబుల్ ఆమెను వెంబడించింది. అనంతరం ఆమె బ్యాగులో ఉన్నదాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. సుమారు 42 గ్రాముల హెరాయిన్ ఆమె బ్యాగులో ఉండటంతో అధికారులు విస్తుపోయారు. తర్వాత ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసులు.. హెరాయిన్ అక్రమ రవాణా అవుతున్నట్టు ఇన్ఫార్మర్ ద్వారా తమకు ముందుగానే సమాచారం అందిందని చెప్పారు. మహిళ దగ్గర పట్టుపడ్డ హెరాయిన్ ఖరీదు.. సుమారు రూ.20లక్షలకుపైగా ఉంటుందని వెల్లడించారు. 




Updated Date - 2022-01-02T21:42:13+05:30 IST