Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 19 2021 @ 17:55PM

హెరాయిన్ పట్టివేత..7గురి అరెస్టు

గాంధీనగర్: ఒక బోటులో హెరాయిన్‌ను తరలిస్తున్న 7గురిని  యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్, ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారులు  గుజరాత్ తీరంలో శనివారం అరెస్టు చేశారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్ని వందల కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. 


గుజరాత్ ఏటీఏస్ డిఫ్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డీఐజీ) హిమాన్షు శుక్లా మీడియాతో మాట్లాడుతూ..‘‘ మేం ఇండియన్ కోస్ట్ గార్డుతో కలిసి శనివారం రాత్రి ఉమ్మడిగా ఆపరేషన్‌ను నిర్వహించి 7గురు ఇరానీయన్లను పట్టుకున్నాం. బోటును సీజ్ చేయగా 30 కి.గ్రా నుంచి 50 కి.గ్రా వరకు హెరాయిన్ పట్టుబడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర రూ.150 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉంటుంది ’’ అని వివరించారు.

Advertisement
Advertisement