Abn logo
Sep 27 2021 @ 01:20AM

హక్కుల కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ

నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే, జడ్పీ, బల్దియా చైర్‌ పర్సన్లు

- ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 26: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత నిజమైన తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహం వద్ద ఆదివారం చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణంతో కలిసి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి  ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో గాజుల రాజేందర్‌, దుర్గయ్య, రమేష్‌ రావు, జీవన్‌, మున్నా, మధుతో పాటు రజక సంఘం నాయకులు ఉన్నారు.

- వెనుకబడిన తరగతుల ప్రజల హక్కుల కోసం పోరాడిన వీర వనిత ఐలమ్మ అని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిని ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ కమార్‌, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ గొల్లపెల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌లతో కలిసి జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత ఐలమ్మ విగ్రహానికి పూలమాల లు నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ ముదుగంటి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు బాలె లత, పంబాల రాము బీసీ వెల్ఫేర్‌ అధికారి సాయిబాబా తదితరులు ఉన్నారు.