ఫారెస్ట్ బాతింగ్: భూమ్ బద్దల్ అప్సర రాణి బాతింగ్ వీడియో వైరల్

అసలు పేరు అంకిత మహారాణా.. అయినప్పటికీ ఈ పేరు ఎవరికీ తెలియదు. అప్సర రాణి, వర్మ భామ లేదంటే భూమ్ బద్దల్ భామ.. అంటే మాత్రం వెంటనే అందరికీ తెలిసిపోతుంది. రామ్ గోపాల్ వర్మ ‘థ్రిల్లర్’, ‘డేంజరస్’ చిత్రాల్లో నటించి.. అందాల ప్రదర్శనతో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అప్సర రాణికి.. ‘క్రాక్’ చిత్రంలోని ‘భూమ్ బద్దల్’ సాంగ్ మంచి క్రేజ్‌ని తీసుకువచ్చింది. ఆ చిత్రం తర్వాత ఐటం స్పెషల్‌గా మారిన అప్సర.. ఇప్పుడు బిజీ భామగా మారిపోయింది. అయినా సరే.. సోషల్ మీడియాలో మాత్రం ఫొటోలు, వీడియోలతో ఎప్పుడూ నెటిజన్లకు టచ్‌లోనే ఉంటుంది. 


తాజాగా ఆమె పోస్ట్ చేసిన స్పైసీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం.. మోడల్‌గా ఉన్నప్పుడు స్విమ్ సూట్‌లో నా మొదటి ఫొటోషూట్ ఇదేనంటూ ఓ హాట్ హాట్ ఫొటోని పోస్ట్ చేసిన అప్పర.. తాజాగా ఫారెస్ట్ బాతింగ్ అంటూ.. ఓ సెలయేరులో స్నానం చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. మరో విషయం ఏమిటంటే.. ఈ వీడియోకి నెటిజన్ల కామెంట్స్ కూడా అంతే హాటుగా ఉన్నాయండోయ్.Advertisement