స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప` సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన బయటకు వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామను ఎంపిక చేసినట్టు సమాచారం. `దబాంగ్-3`లో సల్మాన్‌తో నటించిన సయీ మంజ్రేకర్‌ను బన్నీ సరసన హీరోయిన్గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈమె ప్రస్తుతం అడవి శేష్ `మేజర్` సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా బన్నీ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో కూడా పలు సినిమాలు చేసిన బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురే ఈ సయీ మంజ్రేకర్.