స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి `అయిననూ పోయి రావలె హస్తినకు` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి కావాల్సింది. అయితే `ఆర్ఆర్ఆర్` ఆలస్యం, ఆపై లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. మార్చి నుంచి ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దక్షిణాదితోపాటు బాలీవుడ్లోనూ గుర్తింపు పొందిన కియారా ఆడ్వాణీని హీరోయిన్గా తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఒకవేళ ఆమె డేట్స్ లేకపోతే రష్మికను తీసుకుంటారట. అయితే కియారా లేకుంటే రష్మిక.. ఎవరో ఒకరు ఎన్టీఆర్ సరసన కనిపించే అవకాశం వుంది.