Oct 14 2021 @ 18:43PM

15కిలోల బరువు తగ్గిన నటి..షాక్‌కు గురైన అభిమానులు

మాటలను తూటల్లా సంధించే నటి ఖుష్బూ సుందర్. ఏ చిత్రంలో అయినా సరే బలమైన పాత్ర అయితేనే ఆమె నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటో ఒకటి ట్రెండ్ అయింది. అందుకు కారణం ఏమిటంటే తన పాత, కొత్త లుక్‌లను ఆమె అభిమానులతో పంచుకుంది. 


ఖుష్బూ సుందర్  షేర్ చేసిన ఫొటో ఒకటి సామాజికి మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది.  ఆ ఫొటోలను చూడగానే అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ఆమె ఏకంగా 15కిలోల బరువు తగ్గింది.  ఆ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ..తనలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పింది. కేవలం 15కిలోల బరువును మాత్రమే తగ్గానని వెల్లడించింది. 


ఆ ఫొటోకు నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. ‘‘ అప్పుడు, ఇప్పుడు మీరు అందంగానే ఉన్నారు’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.‘‘ మీరు బరువును తగ్గి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘ మీరు ఎల్లప్పుడు ఫిట్ గా, ఆరోగ్యకరంగా ఉండాలి’’ అని ఒక అభిమాని తన స్పందనను తెలిపారు.


గతంలోను ఖుష్బూ ఇటువంటి ఒక ఫొస్టును అభిమానులతో పంచుకుంది.  చీర ధరించిన ఫొటోను షేర్ చుస్తూ.. తన డైట్ ను నియంత్రణలో ఉంచుకున్నానని తెలిపింది. రోజుకు 2 గంటలు వ్యాయామం చేస్తున్నానని వివరించింది. లాక్ డౌన్ సమయంలో దాదాపుగా 70రోజుల పాటు ఎవరి సహాయం తీసుకోకుండానే పని చేసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె రజనీకాంత్ హీరోగా నటించిన అన్నాత్తే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు.