Sep 21 2021 @ 14:13PM

మేఘా ఆకాశ్ తమిళ చిత్రం ప్రారంభం

ఇటీవల ‘డియర్ మేఘ’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన అందాల మేఘా ఆకాశ్ .. ప్రస్తుతం తమిళంలో ఓ ఫాంటసీ కామెడీ మూవీకి కమిట్ అయింది.  నూతన దర్శకుడు విఘ్నేష్‌ షా పి.ఎన్‌ ఫాంటసీ కామెడీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీనికి ‘సింగిల్‌ శంకరుమ్‌ స్మార్ట్‌ఫోన్‌ సిమ్రాన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. లార్క్‌ స్టూడియో పతాకంపై నిర్మాత కె.కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇందులో మిర్చి శివ హీరోగా, హీరోయిన్లుగా అంజు కురియన్‌, మేఘా ఆకాష్‌ నటిస్తున్నా రు. వీరితోపాటు సింగర్‌ మనో, షా రా, మొట్టై రాజేంద్రన్‌, మకాపా ఆనంద్‌, కల్కి రాజా, కేపీవై బాలా, మైక్‌సెట్‌ అభిలాష్‌, నటి విద్యా వినుమోహన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఫాంటసీ కామెడీ జానర్‌లో తెరకెక్కించే ఈ చిత్రం షూటింగ్‌ చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో జరుపుకోనుంది.  లియోన్‌ జేమ్స్‌ సంగీతం సమకూర్చే ఈ చిత్రం షూటింగ్‌ పూజా సోమవారం నగరంలో ప్రారంభం కాగా, నిర్మాతలు కేఈ ఙ్ఞానవేల్‌రాజా, ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ మదన్‌, డాక్టర్‌ ప్రభుతిలక్‌, దర్శకుడు జాన్సన్‌ తదితరులు పాల్గొన్నారు.