Oct 24 2021 @ 12:21PM

‘వరుడు కావలెను’ మంచి ప్రేమకథ : పూజాహెగ్డే

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో,  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 29న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ను వినూత్నంగా నిర్వహిస్తున్నారు మేకర్స్‌. ఇటీవల ట్రైలర్ ను  విడుదల చేసిన చిత్ర యూనిట్‌, శనివారం సంగీత్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే హాజరయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ , హీరో, హీరోయిన్స్ నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సప్తగిరి, మాటల రచయిత గణేష్‌ రావూరి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, గేయ రచయిత రాంబాబు గోశాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన అందాల పూజాహెగ్డే ‘వరుడు కావలెను’ మంచి ప్రేమకథా చిత్రమని ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని థియేటర్స్ లోనే చూడాలని సూచించారు. ఇంకా  హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ ‘వరుడు కావలెను’ సినిమా విశేషాలు తెలుపుతూ.. చిత్ర యూనిట్ కు విషెస్ తెలిపి.. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నాగశౌర్యకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.