Abn logo
May 23 2020 @ 22:02PM

అవకాశాలొస్తాయని గ్లామర్ గేట్లు ఎత్తేసింది

గ్లామర్ ఫీల్డ్‌లో ఇన్‌స్టెంట్ సక్సెస్ రావాలంటే హీరోయిన్స్ ఏం చేయాలి. సింపుల్ గ్లామర్ గేట్లు ఎత్తేస్తే చాలు. అయితే అది హద్దులు దాటి వల్గర్ బోర్డర్‌లోకి ఎంటర్ కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో మంచి క్లారిటీ‌తో ఉంది ఓ ముద్దుగుమ్మ. సాక్షి అగర్వాల్... తెలుగువారికి అంతగా పరిచయంలేని హీరోయిన్. అయితే కోలీవుడ్‌లో మాత్రం ప్రస్తుతం ఈ అమ్మడు స్పీడ్ చూపిస్తుంది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సాక్షి, తరువాత కాలంలో తమిళ టెలివిజన్ రంగంలో మెరిసింది. ఇందులో భాగంగానే అక్కడ బిగ్ బాస్ 3 సీజన్‌లో పాల్గొని మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక వెండితెరపై మొదటగా ‘రాజా రాణి’ చిత్రంలో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించిన సాక్షి అగర్వాల్... ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీ యాక్టర్‌గా మారిపోయింది.


క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలలో మెరిసిన సాక్షి అగర్వాల్.. 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యోహాన్’ అనే తమిళ మూవీతో హీరోయిన్‌గా మారింది. ఇలా చిన్న చిత్రాలలో నటించిన తరువాత ఈమె రజినీకాంత్ ‘కాలా’, అజిత్ ‘విశ్వాసం’ సినిమాలలో కీలక పాత్రలలో నటించింది. ఇవేవి కూడా ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. దీనితో చివరికి అందాల ప్రదర్శనకు సిద్ధమైంది సాక్షి.


ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ, ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడింది అగర్వాల్ అమ్మాయి. అవకాశాల కోసం గ్లామర్ గేట్లు ఎత్తినా.. సాక్షి అగర్వాల్ వల్గర్ బోర్డర్ టచ్ చేసింది లేదు. శారీ లుక్స్, ట్రెండీ అవుట్ పిక్స్‌తోనే ఈమె కుర్రకారు మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. అయితే ఇవేవి సాక్షిని టాప్ లీగ్‌కు దగ్గర చేసే ప్రాజెక్ట్స్ కావు. మరి సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతోనైనా రానున్న కాలంలో ఈ అమ్మడుకి మంచి అవకాశాలు లభిస్తాయేమో చూద్దాం.

Advertisement
Advertisement
Advertisement