Sep 25 2021 @ 16:05PM

ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప.. ఇప్పుడో ఫేమస్ హీరోయిన్.. ఓ స్టార్ హీరోకు భార్య.. ఎవరో గుర్తు పట్టారా..?

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఆమె ఓ ప్రముఖ హీరోయిన్. తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. డబ్బింగ్ సినిమాతోనే తెలుగులోనూ బోలెడు మంది అభిమానులను సంపాదించుకుంది. ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2018లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లకు నేరుగా ఓ తెలుగు సినిమా చేస్తోంది.. ఆమె వేరెవరో కాదు.. మలయాళ భామ నజ్రియా నజీమ్. 


`రాజా.. రాణి..` సినిమాతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ నజ్రియా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత 2014లో మలయాళ ప్రముఖ హీరో ఫాహద్ ఫాజిల్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత 2018లో ఓ మలయాళ సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఓ తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పింది. నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రయే తెరకెక్కిస్తున్న `అంటే సుందరానికి..` సినిమాలో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె తాజాగా తన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.