హైడ్‌ అండ్‌ సీక్‌ బీచ్‌!

ABN , First Publish Date - 2021-03-27T05:50:04+05:30 IST

పిల్లలూ.. మీరు హైడ్‌ అండ్‌ సీక్‌ ఆట ఆడే ఉంటారు కదా! ఆ పేరుతో ఒక బీచ్‌ ఉన్న విషయం మీకు తెలుసా! అంతేకాదు, బీచ్‌కు ఆ పేరెందుకు వచ్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు

హైడ్‌ అండ్‌ సీక్‌ బీచ్‌!

పిల్లలూ.. మీరు హైడ్‌ అండ్‌ సీక్‌ ఆట ఆడే ఉంటారు కదా! ఆ పేరుతో ఒక బీచ్‌ ఉన్న విషయం మీకు తెలుసా! అంతేకాదు, బీచ్‌కు ఆ పేరెందుకు వచ్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

  • ఒడిశాలోని చండీపూర్‌ బీచ్‌కు ‘హైడ్‌ అండ్‌ సీక్‌ బీచ్‌’ అని కూడా పేరు. ప్రకృతి చేసే మాయాజాలం వల్ల బీచ్‌కు ఆ పేరు వచ్చింది.
  • ఈ బీచ్‌లో సముద్రం రోజూ కొన్ని కిలోమీటర్ల మేర వెనక్కి వెళుతుంది. అంటే కళ్ల ముందే సముద్రం మాయమైపోతుంది. కాసేపటికి మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంది. ఇలా ఒక రోజులో రెండు సార్లు జరుగుతుంది. అందుకే దీనిని ‘హైడ్‌ అండ్‌ సీక్‌ బీచ్‌’ అని పిలుస్తారు.
  • స్థానికులకు సముద్రంలో నీరు ఎప్పుడు వెనక్కి వెళుతుంది, ఎప్పుడు ముందుకు వస్తుందో బాగా తెలుసు. ఆ సమయాల్లో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. సముద్రపు నీరు వెనక్కి వెళ్లినప్పుడు ముత్యాలు, ఎండ్రికాయలు, చిన్న చిన్న చేపలు ఇసుకలో బయటపడుతుంటాయి. నవంబరు నుంచి మార్చి మధ్య కాలంలో సముద్రం నీరు వెనక్కి వెళ్లడం అధికంగా ఉంటుంది. ఈ బీచ్‌కు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే

Updated Date - 2021-03-27T05:50:04+05:30 IST