వాట్సప్‌ చాట్‌ను దాచేయండిలా!

ABN , First Publish Date - 2020-02-22T06:27:59+05:30 IST

వాట్స్‌పలో చాటింగ్‌ చేస్తుంటారు. అందులో కొన్ని చాట్స్‌ ఇతరులు చూడకూడనివి కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు వాటిని దాచేయడం సాధ్యమేనా? అంటే అవును చేయొచ్చు.

వాట్సప్‌ చాట్‌ను దాచేయండిలా!

వాట్స్‌పలో చాటింగ్‌ చేస్తుంటారు. అందులో కొన్ని చాట్స్‌ ఇతరులు చూడకూడనివి కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు వాటిని దాచేయడం సాధ్యమేనా? అంటే అవును చేయొచ్చు. 


  • ముందుగా వాట్సప్‌ ఓపెన్‌ చేయండి. ఎవరి చాట్‌ను దాచేయాలనుకుంటున్నారో ఆ చాట్‌పై ప్రెస్‌ చేసి పెట్టండి.
  • పై భాగంలో బాణం గుర్తు కిందకు చూపిస్తున్నట్టుగా ఉండే ఒక ఐకాన్‌ కనిపిస్తుంది. ఇప్పుడు దానిని ఎంచుకోండి.
  • అంతే.. మీ చాట్‌ లిస్ట్‌లో నుంచి అది కనిపించకుండా పోతుంది.


అన్నీ కనిపించకుండా...

  • పైభాగంలో కుడివైపున ఉన్న త్రీడాట్స్‌పై క్లిక్‌ చేయండి.
  • సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో చాట్‌, చాట్‌హిస్టరీని ఎంచుకోండి.
  • తరువాత అర్చివ్‌ ఆల్‌ చాట్స్‌పై క్లిక్‌ చేయండి. 
  • ఇప్పుడు మీ వాట్సప్‌ లిస్ట్‌లో ఉన్న చాట్స్‌ ఇతరులకు 
  • కనిపించవు. 


రికవరీ ఎలా?

  • వాట్సప్‌ ఓపెన్‌ చేయండి.
  • చాట్స్‌ ట్యాబ్‌లో ఉండి స్ర్కీన్‌ బాటమ్‌కు స్ర్కోల్‌ చేస్తూ వెళ్ళండి.
  • అక్కడ అర్చివ్‌ ఆప్షన్‌ ఉంటుంది. దానిపై ప్రెస్‌ చేస్తే పై భాగంలో బాణం గుర్తు పైకి చూపిస్తున్నట్టుగా ఉండే ఒక ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే హైడ్‌ అయిన చాట్స్‌ మళ్లీ కనిపిస్తాయి.

Updated Date - 2020-02-22T06:27:59+05:30 IST