అనుభవం లోంచి హై5 ఆలోచన!

ABN , First Publish Date - 2021-04-10T06:13:42+05:30 IST

నెలసరి సమయంలో మహిళలు చాలా శక్తిని కోల్పోతారు. కొందరిలో కండరాలు పట్టేస్తుంటాయి. ఆ సమయంలో వారికి శక్తితో పాటు పోషణ ఇచ్చే ఆహారం కావాలి. పన్నెండేళ్ల అమ్మాయి అయిరాహ్‌ లోధా ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు

అనుభవం లోంచి హై5 ఆలోచన!

నెలసరి సమయంలో మహిళలు చాలా శక్తిని కోల్పోతారు. కొందరిలో కండరాలు పట్టేస్తుంటాయి. ఆ సమయంలో వారికి శక్తితో పాటు పోషణ ఇచ్చే ఆహారం కావాలి. పన్నెండేళ్ల అమ్మాయి అయిరాహ్‌ లోధా ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. పోషకాలతో నిండిన గ్రనోలా బార్స్‌ను అందిస్తున్న ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌ విశేషాలివి...


మా అమ్మకు కూడా పీరియడ్‌ క్రాంప్స్‌ వచ్చేవి. శక్తికోసం తినదగ్గ ఆహారం ఆమెకు అప్పట్లో దొరికేది కాదు. వేడినీటి సంచులతో పీరియడ్‌ క్రాంప్స్‌ నుంచి బయటపడే ప్రయత్నం చేసేది.  


ఏడో తరగతి చదువుతున్న అయిరా్‌హకు గ్రనోలా బార్స్‌ తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే... అయిరా్‌హకు మొదటిసారి పీరియడ్‌ వచ్చినప్పుడు ఎంతో నీరసంగా అనిపించింది. సెలసరి సమయంలో మహిళలు తినదగ్గ ఆహారం మార్కెట్‌లో లేదని తెలుసుకుంది. నెలసరి వేళలో కండరాలు పట్టేయడాన్ని అడ్డుకునేందుకు, మూడ్‌ను మార్చే ఆహార పదార్థాలు ఏమేం ఉన్నాయో పరిశోధించింది. అంతేకాదు 100 మంది మహిళలను అడిగి వారి నెలసరి అనుభవాలను   తెలుసుకుంది. వారిలో 87శాతం మంది మూడ్‌ స్వింగ్స్‌కు లోనయ్యామని, 79శాతం మంది పీరియడ్‌ క్రాంప్స్‌తో ఇబ్బంది పడ్డామని చెప్పారు. అప్పుడే అయిరా్‌హకు ఐరన్‌ ఎక్కువగా ఉండే ఖర్జూరం, మూడ్స్‌ను ప్రభావితం చేసే డార్క్‌ చాక్లెట్లతో రుతుచక్రంలోని మహిళలకు ఉపయోగపడే గ్రనోలా బార్స్‌ను తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. ఇదే విషయాన్ని వాళ్ల అమ్మ వింతీ లోధా, వాళ్ల ఫ్యామిలీ డాక్టర్‌తో చెబితే వాళ్లు కూడా ప్రోత్సహించడంతో  పోషకాలతో కూడిన హై5 బ్రాండ్‌కు రూపమిచ్చింది అయిరాహ్‌. 


‘‘కొత్తలో చాలామంది మహిళలు నా ఆలోచనను తప్పుగా అర్థం చేసుకున్నారు. దాంతో ‘హై5 గ్రనోలా బార్‌’ను మార్కెట్‌ చేయడం మొదట్లో సవాల్‌గా అనిపించింది. అప్పుడు సోషల్‌ మీడియా ద్వారా, కొందరు మహిళలతో నేరుగా మాట్లాడడం ద్వారా నా ఉత్పత్తి పట్ల వారిలో నమ్మకం కలిగించాను. క్రమంగా అమ్మకాలు పెరిగాయి. ఉపశమనానికి సంకేతంగా  ‘హై’, సెలసరి అయిదు రోజుల్లో ముగుస్తుందనడానికి సంకేతంగా 5ను కలిపి నా ఉత్పత్తికి ‘హై5’ అని పేరు పెట్టాను. 


మా అమ్మకు కూడా పీరియడ్‌ క్రాంప్స్‌ వచ్చేవి. శక్తికోసం తినదగ్గ ఆహారం ఆమెకు అప్పట్లో దొరికేది కాదు. వేడినీటి సంచులతో పీరియడ్‌ క్రాంప్స్‌ నుంచి బయటపడే ప్రయత్నం చేసేది. మా గ్రనోలా బార్‌తో కండరాలు పట్టేయడం తగ్గడమే కాదు మూడ్‌ కూడా మారుతుంది. గ్రనోలా బార్‌తో పాటు ఇతర ఆహారపదార్థాలు కావాలనుకునే వారు ఃజిజీజజి5టుఽ్చఛిజుట ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా, ఠీఠీఠీ.జిజీజజిజజీఠ్ఛిటుఽ్చఛిజుట.ఛిౌఝ వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌ ఇవ్వొచ్చు’’ అంటుందీ అయిరాహ్‌.

Updated Date - 2021-04-10T06:13:42+05:30 IST