దూబే అరెస్టుతో కాన్పూర్‌లో హైఅలర్ట్

ABN , First Publish Date - 2020-07-09T16:25:49+05:30 IST

కాన్పూరుకు చెందిన కరడు కట్టిన గ్యాంగస్టర్ వికాస్ దూబే అరెస్టు అనంతరం కాన్పూర్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.....

దూబే అరెస్టుతో కాన్పూర్‌లో హైఅలర్ట్

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కాన్పూరుకు చెందిన కరడు కట్టిన గ్యాంగస్టర్ వికాస్ దూబే అరెస్టు అనంతరం కాన్పూర్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉజ్జయిని నగరంలోని మహాకాళీ దేవాలయంలో పూజలు చేసేందుకు వచ్చిన వికాస్ దూబేను గుర్తించిన అక్కడి దేవాలయ గార్డు అతన్ని పట్టుకొని ఉజ్జయిని ఎస్పీకి సమాచారం అందించాడు. ఉజ్జయిని ఎస్పీ మనోజ్ సింగ్ 150 మంది సాయుధ పోలీసులను వెంట తీసుకొని వచ్చి గార్డు నుంచి వికాస్ దూబేను కస్టడీలోకి తీసుకున్నారు. ఉజ్జయినిలో వికాస్ దూబే అరెస్టును మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా ధ్రువీకరించారు. వికాస్ దూబేపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కేసులు లేకపోవడంతో అతన్ని ట్రాన్సిట్ రిమాండుపై యూపీ పోలీసులకు అప్పగిస్తామని ఉజ్జయిని పోలీసులు చెప్పారు. 8మంది పోలీసులను హతమార్చిన వికాస్ దూబే పరారీ అనంతరం కాన్పూర్ తోపాటు యూపీ రాష్ట్రం మొత్తం, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అతని కోసం గాలించారు. ఎట్టకేలకు ఉజ్జయినిలో వికాస్ దూబేను అరెస్టు చేయడం సంచలనం రేపింది. 


Updated Date - 2020-07-09T16:25:49+05:30 IST