రక్తపోటు, మధుమేహం ఉందా? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి!

ABN , First Publish Date - 2021-07-06T17:46:06+05:30 IST

మన శరీరంలో సంక్లిష్టమైన అవయవాలు మూత్రపిండాలు. రక్తంలోని వ్యర్థాలను వడగట్టడంతో పాటు, రక్తపోటును నియంత్రించడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి బి.పి ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలు కూడా చేయించుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహంతో బాఘపడేవారికి

రక్తపోటు, మధుమేహం ఉందా? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి!

మూత్రపిండాల వ్యాధులు

కిడ్నీ ఇన్‌ఫెక్షన్స్‌

కిడ్నీ స్టోన్స్‌

కిడ్నీ ఫెయిల్యూర్‌

కిడ్నీ ట్యూమర్స్‌, కేన్సర్లు


మన శరీరంలో సంక్లిష్టమైన అవయవాలు మూత్రపిండాలు. రక్తంలోని వ్యర్థాలను వడగట్టడంతో పాటు, రక్తపోటును నియంత్రించడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి బి.పి ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలు కూడా చేయించుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహంతో బాఘపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి కిడ్నీ ఫంక్షన్‌ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి


స్త్రీలలో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్‌ యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ మూత్రపిండాలకు పాకి, ఇన్‌ఫెక్షన్‌కు గురి చేస్తాయి. యాంటీబయాటిక్‌ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుందది.


పురుషుల్లో ఎక్కువగా కనిపించే మూత్రపిండాల రాళ్లలో రకాలుండడంతో పాటు ఇసుకరేణువు పరిమాణం దగ్గర్నుంచి, గోల్ఫ్‌ బాల్‌ సైజు వరకూ రాళ్లు ఉంటూ ఉంటాయి. తీవ్రమైన బాధను కలిగించే ఈ సైజు రాళ్లు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు ఉన్నాయి.


అధిక బరువు, ధూమపానం, మద్యపానం, అధిక రక్తపోటు, షుగర్‌ అదుపు తప్పడం వల్ల, ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడుతుంది. అవి పూర్తిగా ఫెయిల్‌ అయినప్పుడే లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక సైలెంట్‌ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్పనిసరి.


పుట్టుకతో వచ్చే మూత్రపిండాల్లో కణితులు పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేక డాక్టర్‌ చెకప్‌లో బయట పడుతూ ఉంటాయి. సైజును బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి, బరువు తగ్గడం, అజీర్ణం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నోఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్‌ ట్యూమర్స్‌గా చెప్పుకునే మూత్రపిండాల్లో కణితులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే ఈ కణితులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే! 


రీనల్‌సెల్‌ కార్సినోమా రకం కణితి పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ కేన్సర్‌కు ఎక్కువ. ఒక్కోసారి మెటాస్టాసిస్‌ అయిన భాగాల ద్వారా కూడా ఈ కేన్సర్‌ గుర్తించడం జరుగుతూ ఉంటుంది. అనేక సబ్‌టైపుల్లో ఉండే ఈ కేన్సర్‌ కిడ్నీ సంబంధ పరీక్షల్లో, అలా్ట్రసౌండ్‌ పరీక్షల్లో బయల్పడడం జరుగుతూ ఉంటుంది. వయస్సు పైబడేకొద్దీ ఈ కేన్సర్‌ పెరిగే అవకాశాలు ఎక్కువ. కానీ ధూమపానం చేసే చిన్న వయసువారిలో ఈ కేన్సర్‌ నమోదవుతున్నట్టు సర్వేలు తెలియచేస్తున్నాయి.


లక్షణాలు కనిపించినప్పుడు ఫిజికల్‌ ఎగ్జామ్‌, బ్లడ్‌ టెస్ట్‌లు, యూరిన్‌ టెస్ట్‌లు, ఎక్స్‌రే, అలా్ట్రసౌండ్‌, సిటి, ఎమ్మారై, క్యాల్షియం లెవల్స్‌ తెలిపే పరీక్షలు చేయించాలి. కేన్సర్‌ బయటపడేలోపే ఊపిరితిత్తులు, ఎముకలకు కూడా పాకే వీలుంది కాబట్టి చెస్ట్‌ ఎక్స్‌రే, బోన్‌ స్కాన్స్‌ కూడా చేయిస్తూ ఉండాలి. 


డాక్టర్‌ మోహన వంశీ,

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.ఫోన్‌: 9848011421


Updated Date - 2021-07-06T17:46:06+05:30 IST