ఇద్దరు ఐఏఎస్‌, ఇద్దరు ఐఎ్‌ఫఎస్‌ అదనపు కలెక్టర్‌, డిఎఫ్‌వోలకు జైలు

ABN , First Publish Date - 2021-08-01T09:20:08+05:30 IST

న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఇద్దరు ఐఏఎస్‌, ఇద్దరు ఐఎ్‌ఫఎ్‌సలతో సహా ఆరుగురు అధికారులకు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆరు నెలల

ఇద్దరు ఐఏఎస్‌, ఇద్దరు ఐఎ్‌ఫఎస్‌ అదనపు కలెక్టర్‌, డిఎఫ్‌వోలకు జైలు

కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు తీర్పు 


హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఇద్దరు ఐఏఎస్‌, ఇద్దరు ఐఎ్‌ఫఎ్‌సలతో సహా ఆరుగురు అధికారులకు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2వేలు చొప్పున జరిమానా విధించింది. అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఆర్‌.శోభ (ఐఎ్‌ఫఎస్‌), రంగారెడ్డి జిల్లా సీసీఎఫ్‌ సునీత ఎం. భగత్‌ (ఐఎ్‌ఫఎస్‌), అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.శాంతకుమారి (ఐఏఎస్‌), రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌(ఐఏఎ్‌స)లతోపాటు అదనపు కలెక్టర్‌, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి ఎస్‌. తిరుపతిరావు, రంగారెడ్డి జిల్లా అటవీ అధికారి జానకీరామ్‌లకు కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ తీర్పు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ప్రైవేట్‌ భూమిని అటవీభూమిగా మార్చే విషయంపై 2008 నుంచి వివాదం కొనసాగుతోంది. దీనిపై హైకోర్టు 2009లో ఇచ్చిన తీర్పుని అధికారులు అమలు చేయకపోవడంతో హైకోర్టు వారికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. 

Updated Date - 2021-08-01T09:20:08+05:30 IST