రాజధాని పిటిషన్లపై 2 నుంచి రోజువారీ విచారణ

ABN , First Publish Date - 2020-10-13T09:10:54+05:30 IST

రాజధాని అంశాలకు సంబంధించిన ప్రధాన పిటిషన్లపై వచ్చే నెల 2వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపడతామని ..

రాజధాని పిటిషన్లపై  2 నుంచి రోజువారీ విచారణ

మండలి వీడియో ఫుటేజ్‌ సీల్డ్‌ కవర్‌లో ఇవ్వండి

హైకోర్టు ఆదేశం

ప్రతివాదుల జాబితా నుంచి 

సీఎం, మంత్రుల పేర్లు తొలగింపు

విశాఖలో అతిథి గృహం నిర్మాణంపై తీర్పు వాయిదా


అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాజధాని అంశాలకు సంబంధించిన ప్రధాన పిటిషన్లపై వచ్చే నెల 2వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర శాసనమండలిలో జరిగిన పరిణామాలను పరిశీలించేందుకు అనువుగా వీడియో ఫుటేజీని సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఆ తుది విచారణను వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా లేదా భౌతిక విచారణ ద్వారా చేపడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది.


అమరావతి వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారణ చేపట్టిన ధర్మాసనం తొలిగా.. అనుబంధ పిటిషన్లను(ఐఏ)లను అంశాలవారీగా విభజించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం కూడా కొన్ని ఐఏలపై విచారణ జరిగింది. రాజధాని పిటిషన్లలోని ఒకదానిలో వ్యక్తిగత హోదాలో సీఎం జగన్‌, మంత్రులు బొత్స స త్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులను పేర్కొనడం విదితమే. అయితే ఆ జాబితా నుంచి వారి పేర్లు తొలగించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు సమ్మతించింది. ఆ మేరకు ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. అయితే విచారణలో భాగంగా ఎప్పుడైనా వారి స్పందన అవసరమై తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొనడంతో పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు అంగీకరించారు.


శాశ్వత కార్యాలయం అమరావతిలోనే

సీఎం కార్యాలయంపై దాఖలైన పిటిషన్‌ను ధర్మాస నం మూసివేసింది. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు, న్యాయవాది సాయిసంజయ్‌ వాదనలు వి నిపిస్తూ.. సీఎం శాశ్వత ఆఫీస్‌ అమరావతిలోనే ఉండాలని తెలిపారు. తాత్కాలిక క్యాంపు కార్యాలయం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని, అ యితే శాశ్వత కార్యాలయం రాజధానిలోనే ఉం డాలని పేర్కొన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మూసివేసింది.


ఆ కార్యాలయాలకు స్టేటస్‌ కో

సీఆర్‌డీఏ పరిధిలోని పలు కార్పొరేషన్‌ కార్యాలయాలకు స్టేట్‌సకో వర్తిస్తుందని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీ రాం అంగీకరించారు. అదేవిధంగా రాజధానిగా అమరావతి ఉండగా, విశాఖ, కర్నూలుల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి వ్యయం చేయరాదని ఓ అనుబంధ పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక రాజధాని ప్రాంతంలో 1,251 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన జీవోను ఇప్పటికే నిలుపుదల చేసి ఉండడంతో మళ్లీ దానిపై స్టేట్‌సకో ఉత్తర్వులు అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. రాజధానికి భూ ములికిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దానిని మూసివేసింది.


విశాఖ అతిథి గృహంపై తీర్పు రిజర్వు

రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో చేపట్టిన అతిథి గృహ ని ర్మాణం వ్యవహారంపై ధర్మాసనం తీర్పును రిజర్వు చే సింది. రాజధాని నుంచి కార్యాలయాల తరలింపుపై యఽథాతథ స్థితి ఉత్తర్వులు అమలులో ఉండగా.. ప్రభు త్వం విశాఖ గ్రేహౌండ్స్‌ కొండపై 30 ఎకరాల విస్తీర్ణం లో అతిథి గృహం నిర్మించతలపెట్టిందని పేర్కొంటూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌లో తగిన వివరాలు లేవని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నితేష్‌ గు ప్తా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ నిర్మాణం తాలూకు ప్లాన్‌, అంచనా వ్యయం లేవని తెలిపారు. పాలనా రా జధాని తరలింపులో భాగంగానే ఈ అతిథి గృహం ని ర్మిస్తున్నారని చెప్పారు. పరిపాలనా రాజధాని ఏర్పాటు లో భాగంగా ఆ నిర్మాణం జరపడం లేదని, ఆ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ ఇంకా సిద్ధం కాలేదని అడ్వకే ట్‌ జనరల్‌ తెలిపారు.


ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ అతిథి గృహ నిర్మాణంపై ఉన్న స్టేట్‌సకో ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అయితే అతిథి గృహ నిర్మాణ ప్లాన్‌ సిద్ధం చేసుకోవచ్చని, ఆ నిర్మాణ ప్లాన్‌ సిద్ధమయ్యాక.. స్టేట్‌సకో ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ జోక్యం చేసుకుంటూ.. ఇతర ప్రాంతాల్లో నిర్మించే అతిథి గృహాలతో విశాఖ అతిథి గృహాన్ని పిటిషనర్లు పోల్చడం సరికాదన్నారు. గతంలో జారీ చేసిన స్టేట్‌సకో ఉత్తర్వులను తొలగించాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.

Updated Date - 2020-10-13T09:10:54+05:30 IST