AP: మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై హైకోర్టులో విచారణ...సీఎస్, డీజీపీకి నోటీసులు

ABN , First Publish Date - 2021-10-26T17:06:38+05:30 IST

గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

AP: మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై హైకోర్టులో విచారణ...సీఎస్, డీజీపీకి నోటీసులు

అమరావతి: గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.  పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ చైర్మన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెవిన్యూలో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు విధులు మహిళా కార్యదర్శులకు ఎలా ఇస్తారో చెప్పాలని హైకోర్ట్ ఆదేశించింది. 1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్ కు విరుద్ధమని  న్యాయవాది బాలాజీ అన్నారు. సివిల్ వివాదాలను పరిష్కరించవచ్చని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమని న్యాయవాది పేర్కొన్నారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. 

Updated Date - 2021-10-26T17:06:38+05:30 IST