పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయం!

ABN , First Publish Date - 2020-04-09T09:12:04+05:30 IST

నిత్యావసరాలకోసం బయటకొచ్చే సామాన్యుల పట్ల కనికరం లేకుండా పోలీసులు చితకబాదడాన్ని ప్రశ్నిస్తూ ఉమే్‌షచంద్ర అనే న్యాయవాది హైకోర్టు సీజేకు రాసిన లేఖపై ధర్మాసనం స్పందించింది. ఈ లేఖను సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఒకటి రెండు ఘటనలను మొత్తం పోలీసు

పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయం!

ఒకట్రెండు ఘటనలను మొత్తానికి ఆపాదించొద్దు

లాక్‌డౌన్‌ ఘటనలపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): నిత్యావసరాలకోసం బయటకొచ్చే సామాన్యుల పట్ల కనికరం లేకుండా పోలీసులు చితకబాదడాన్ని ప్రశ్నిస్తూ ఉమే్‌షచంద్ర అనే న్యాయవాది హైకోర్టు సీజేకు రాసిన లేఖపై ధర్మాసనం స్పందించింది. ఈ లేఖను సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఒకటి రెండు ఘటనలను మొత్తం పోలీసు వ్యవస్థకు ఆపాదించలేమని తెలిపింది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా ఎలాంటి ఆదేశాలివ్వలేమని తేల్చిచెప్పింది. అయితే రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయో వివరిస్తూ వేర్వేరు నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయా ఘటనలకు బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. వనపర్తిలో కుమారుడి ముందే పోలీసులు తండ్రిని చితకబాదిన ఉదంతాన్ని ఉటంకిస్తూ న్యాయవాది హైకోర్టు సీజేకు ఈమెయిల్‌ పంపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఒకటి, రెండు సంఘటనలను పరిగణనలోకి తీసుకుని దాన్ని మొత్తం పోలీసు వ్యవస్థకు ఆపాదించలేమని వ్యాఖ్యానించింది. నిబంధనలు అతిక్రమించి వ్యవహరించిన పోలీసులపై ఎలాంటి తీసుకున్నారో చెప్పాలని డీజీపీని ఆదేశించింది. ఇదిలావుండగా, వేర్వేరు అంశాలపై నలుగురు రాసిన లేఖలను హైకోర్టు సుమోటో పిల్స్‌గా విచారణ చేపట్టింది. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది కరుణసాగర్‌ లేఖ రాశారు. పబ్లిక్‌ కార్యాలయాల వద్ద వైరస్‌ నిరోధక ద్వారాలు ఏర్పాటు చేయాలని కోరుతూ మరో న్యాయవాది రోనాల్డ్‌ రాజు లేఖ రాశారు. ఉద్యోగుల వేతనాల్లో 50శాతం కోతవిధిస్తూ ఇచ్చిన జీవోని సవాల్‌ చేస్తూ న్యాయవాదులు సరసాని సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్‌ విడివిడిగా లేఖలు రాశారు. ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని ఏజీని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - 2020-04-09T09:12:04+05:30 IST