తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-08-11T23:47:08+05:30 IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. వినాయకచవితి ఉత్సవాల్లో జనం గుమిగూడకుండా చర్యలు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. వినాయకచవితి ఉత్సవాల్లో జనం గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఇతర పండగల సందర్భంగా జనం గుమిగూడకుండా చూడాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఆంక్షలు, మార్గదర్శకాలను వీలైనంత ముందుగా ప్రజలకు తెలపాలని, మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల మాదిరిగా వివిధ అంశాల ఆధారంగా రోడ్ మ్యాప్ తయారు చేయాలని, సీరో సర్వైలెన్స్ వివరాలు సమర్పించాలని, కరోనాపై ఏర్పాటైన కమిటీ సమావేశం వివరాలు సమర్పించాలని  హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై విచారణ సెప్టెంబరు 8కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-08-11T23:47:08+05:30 IST