Advertisement
Advertisement
Abn logo
Advertisement

కౌంటర్ దాఖలు చేయాలని ఎస్వీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం

అమరావతి: ఎస్వీ వర్సిటీ పరిధిలోని 137 అనుబంధ కళాశాలలకు నిబంధనలకు విరుద్ధంగా రెక్టర్ గుర్తింపు ఇవ్వడంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ పథకాల నిధుల కోసం వసతులు లేని 137 అనుబంధ కళాశాలలకు అనుమతి ఇవ్వడంపై జర్నలిస్ట్ దొరస్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపును న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ముడుపులు తీసుకుని అనుమతులిచ్చారని శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. కేసును సీబీసీఐడీ లేదా విజిలెన్స్‌తో విచారణకు ఆదేశించాలని కోరారు. వర్సిటీ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement