Abn logo
Sep 21 2021 @ 14:20PM

గంగవరంలో వాటా విక్రయం పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

అమరావతి : గంగవరంలో వాటా విక్రయం పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లెకు చెందిన డాక్టర్‌ సత్యభూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. గంగవరం నౌకాశ్రయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 10.40% వాటాను(షేర్లను) అదానీ పోర్ట్స్‌కు విక్రయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మారిటైం బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ తరుపు న్యాయవాదులు సమయం కోరారు. అనంతరం విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.