HYD : Pubs, Hotels కు హైకోర్టు నోటీసులు..

ABN , First Publish Date - 2021-12-23T13:00:52+05:30 IST

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పబ్స్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని...

HYD : Pubs, Hotels కు హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్‌ సిటీ : నివాస గృహాల మధ్య ధ్వని కాలుష్య ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పలు పబ్స్‌, హోటల్స్‌ యజమానులకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. జూబ్లీహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధ్వని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అసోసియేషన్‌, పలువురు అసోసియేషన్‌ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పబ్స్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తోపాటు పలు పబ్స్‌, హోటల్స్‌ తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ వచ్చేనెలకు వాయిదా పడింది.

Updated Date - 2021-12-23T13:00:52+05:30 IST