కరోనా మరణాలు.. చికిత్సపై 17న హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-05-15T09:44:48+05:30 IST

ఆక్సిజన్‌ అందక మరణిస్తున్న కొవిడ్‌ బాధితుల కుటుంబాలకు పరిహారం ఇప్పించడంతో పాటు చికిత్సలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామికి న్యాయవాదులు రాసిన మూడు లేఖలను..

కరోనా మరణాలు.. చికిత్సపై 17న హైకోర్టులో విచారణ

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆక్సిజన్‌ అందక మరణిస్తున్న కొవిడ్‌ బాధితుల కుటుంబాలకు పరిహారం ఇప్పించడంతో పాటు చికిత్సలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామికి న్యాయవాదులు రాసిన మూడు లేఖలను.. న్యాయస్థానం సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా స్వీకరించింది. వీటిపై సోమవారం విచారణ జరగనుంది.


అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 12 మంది కరోనా బాధితులు మృతి చెందారని న్యాయవాది రాపోలు భాస్కర్‌ లేఖ రాశారు. విజయవాడలో వివిధ ప్రైవేటు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక పలువురు మరణిస్తున్నారని న్యాయవాది గంగిశెట్టి ఉమాశంకర్‌ హైకోర్టు సీజేకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కర్నూలుకు చెందిన న్యాయవాది సురేంద్రనాథ్‌.. హైకోర్టు సీజేకు లేఖ రాశారు. 

Updated Date - 2021-05-15T09:44:48+05:30 IST