Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్సీ కాలనీలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఎస్సీ కాలనీలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న భీమవరం మున్సిపాలిటీ చర్యలపై హైకోర్టు స్టే విధించింది. దళితవాడలో డంపింగ్ యార్డ్ నిర్మాణం చట్టవిరుద్ధమన్న పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పిటిషనర్ తరపు లాయర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.దళితవాడలో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement
Advertisement