కొత్తపేట పండ్ల మార్కెట్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-11-17T02:19:35+05:30 IST

కొత్తపేట పండ్ల మార్కెట్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బాటసింగారం

కొత్తపేట పండ్ల మార్కెట్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: కొత్తపేట పండ్ల మార్కెట్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బాటసింగారం, గడ్డిఅన్నారం  పండ్ల మార్కెట్ సమస్యపై అడ్వకేట్ కమిషనర్‌ను హైకోర్టు నియమించింది. మార్కెట్లను సందర్శించాలని అడ్వకేట్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 19లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టు దృష్టికి పిటిషనర్‌ తీసుకెళ్లారు.  హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గడ్డిఅన్నారం మార్కెట్‌ను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.  ప్రభుత్వం తరపున వాదనలను స్పెషల్ జీవీ సంజీవ్ కుమార్ వినిపించారు. బాటసింగారం నూతన పండ్ల మార్కెట్ దగ్గర అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కోర్టుకు ప్రభుత్వ లాయర్‌ తెలిపారు. దీనికి సంబంధించిన బాటసింగారం పండ్ల మార్కెట్ ఫొటోలను కోర్టుకు లాయర్‌ సమర్పించారు. తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 19కు వాయిదా వేసింది.  

Updated Date - 2021-11-17T02:19:35+05:30 IST