Abn logo
Oct 9 2021 @ 14:59PM

ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు తీర్పు బాధాకరం: మంత్రి బొత్స

విజయనగరం: ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు తీర్పు బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ముందుకు సాగకుండా అన్నివిధాలా అడ్డుపడుతున్నారని తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆస్తులు విక్రయించడమనేది సాధారణమని పేర్కొన్నారు. కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మితే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయా? అని ప్రశ్నించారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే విపక్షాల మౌనం ఎందుకు? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండిImage Caption