Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ ఆతృత సరైంది కాదని హైకోర్టు స్పష్టం చేసింది: వర్ల రామయ్య

అమరావతి: సీఎం జగన్ ఆతృత సరైంది కాదని హైకోర్టు స్పష్టం చేసిందని టీడీపీ నేత వర్లరామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు ఏమాత్రం నైతిక విలువలున్నా.. మాజీ సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తప్పుడు కేసులు పెట్టనని స్పష్టం చేయాలన్నారు. తప్పుడు కేసులు పెట్టడం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అలవాటేనని వర్లరామయ్య దుయ్యబట్టారు.


చంద్రబాబు, మాజీమంత్రి నారాయణ సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సీఐడీ కేసు విచారణపై న్యాయస్థానం 4 వారాలు స్టే విధించింది. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని కోర్టు కోరింది. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని, పూర్తి స్థాయి విచారణకు అనుమతించాలని హైకోర్టును సీఐడీ అధికారులు  కోరారు.

Advertisement
Advertisement