ముక్కంటి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2021-10-18T06:07:59+05:30 IST
వాయులింగేశ్వరుడి దర్శనార్థం హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ శ్రీకాళహస్తి విచ్చేశారు.
శ్రీకాళహస్తి అక్టోబరు 17: జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడి దర్శనార్థం ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ కుటుంబసభ్యులతో కలసి శ్రీకాళహస్తి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో పెద్దిరాజు దక్షిణ గాలిగోపురం వద్ద స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకున్న న్యాయమూర్తిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి అరుణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.