Abn logo
Sep 25 2021 @ 23:35PM

శ్రీముఖలింగేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న ఈవో, అర్చకులు

శ్రీముఖలింగం (జలుమూరు), సెప్టెంబరు 25: శ్రీముఖలింగం ముఖలింగేశ్వర స్వామిని శనివారం హైకోర్టు న్యాయమూర్తి కె.విజయలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు పూర్ణకుంభంతో వేదమంత్రాల నడుమ స్వాగతం పలికి వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనం తరం ఆశీర్వదించి శేషవస్త్రాలను అందించారు. ఆలయ శిల్పకళా విశిష్టతను వారికి వివరించారు. అలాగే వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు.  ఆమెతో పాటునరసన్నపేట, పాతపట్నం కోర్టు సూపరింటెండెంట్‌లు బి.నాగభూషణరావు,  శ్రీనివాసరావు, సీనియర్‌ న్యాయవాది చింతాడ వెంకటరావు, ఈవో సూర్యనారాయణ తదితరులున్నారు.