Abn logo
Oct 25 2021 @ 00:44AM

రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి మాధవి దేవి

స్వాగతం పలుకుతున్న న్యాయమూర్తి వినిల్‌ కుమార్‌

వేములవాడ టౌన్‌, అక్టోబరు 24 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారిని  హైకోర్టు జడ్జి మాధవి దేవి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో ప్రతాప నవీన్‌  స్వామివారి ప్రసాదం అందజేశారు.  అంతకుముందు జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, వేములవాడ న్యాయమూర్తి వినిల్‌కుమార్‌, ఆలయ ఏఈవో హరికిషన్‌, పర్యవేక్షకుడే శ్రీరాములు, పీఆర్‌వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు.