హైకోర్టు తీర్పు హర్షణీయం

ABN , First Publish Date - 2020-05-30T11:16:26+05:30 IST

హైకోర్టులో నిమ్మగడ్డకు న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు.

హైకోర్టు తీర్పు హర్షణీయం

అల్లూరు, మే 29 : హైకోర్టులో నిమ్మగడ్డకు న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఓ గుణపాఠమన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు నిరంజన్‌రెడ్డి, అనంతరాజు బాలకృష్ణంరాజు, ఊటు అశోక్‌రెడ్డి, పప్పు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


కొడవలూరు : హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని గ్రంథాలయ జిల్లా మాజీ చైర్మన్‌ మందిపాటి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నార్తురాజుపాలెంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తువ్వర ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 


వెంకటాచలం :  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను మళ్లీ ఆ పదవిలో కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంపై బీజేపీ మండలాధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్‌ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.


కోట : ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే ధర్మమే గెలిచిందని టీడీపీ సత్యవేడు నియోజక వర్గ పరిశీలకుడు తూపిలి రాధాకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ఎన్నో అడ్డదార్లు తొక్కిందన్నారు. టీడీపీ నాయకులు కన్వీనర్‌ మద్దాలి సర్తోత్తమరెడ్డి, మైనారిటీసెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ జలీల్‌ అహ్మద్‌లు వేర్వేరుగా హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-30T11:16:26+05:30 IST