మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-06-14T20:33:01+05:30 IST

మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయం: చంద్రబాబు

అమరావతి: మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలిందని హెచ్చరించారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వ చీకటి జీవోలను కొట్టేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు తుగ్లక్ సీఎంకి చెంపపెట్టన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల ఆస్తుల్ని, వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలని జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు చట్టం అడ్డుకట్ట వేయడం హర్షణీయమని చంద్రబాబు పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా ఎన్ని చీకటి జీవోలు ఇచ్చినా చట్టం ముందు న్యాయానిదే గెలుపు అని నిరూపించిందన్నారు. పూసపాటి వంశీకులు ఆదరించిన లక్షలాది మంది విద్యార్ధులు.. వేలాది మంది ఉద్యోగులకు హైకోర్టు తీర్పు ఊపిరినిచ్చిందని చంద్రబాబు అన్నారు.


‘‘అలుపెరుగక న్యాయ పోరాటంతో ట్రస్టును కాపాడుకోవడం అశోక్ గజపతిరాజుతో పాటు ట్రస్టు ద్వారా ఆదరింపబడుతున్న అందరి విజయం. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమం. దేశంలో ఏ సీఎం కూడా కోర్టులతో ఇన్నిసార్లు తలందించుకున్నది లేదు. కోర్టులిచ్చే తీర్పులతో అయినా.. జగన్ రెడ్డి మూర్ఖత్వం వీడాలి. అధికారులు గుడ్డిగా జీవోలివ్వడం మానుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను హరించేలా నిరంకుశ పాలన సాగిస్తున్న.. జగన్ రెడ్డికి ఈ తీర్పుతో నైనా కనువిప్పు కలగాలి’’ చంద్రబాబు వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-06-14T20:33:01+05:30 IST